Karnataka Polls : సమాజం ప్రశాంతంగా ఉంటే కాంగ్రెస్ కుదురుగా కూర్చోదు : మోదీ
ABN , First Publish Date - 2023-05-03T12:52:42+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీ విజయం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీ విజయం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) జోరుగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం ఆయన మూడబిడ్రిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సమాజంలో ప్రశాంతత ఉంటే, కాంగ్రెస్ ప్రశాంతంగా కూర్చోదని చెప్పారు. దేశం అభివృద్ధి చెందుతూ, ప్రగతిపథంలో పయనిస్తూ ఉంటే కాంగ్రెస్ సహించదని తెలిపారు. ఆ పార్టీ రాజకీయాలు కేవలం ‘విభజించు, పాలించు’ సూత్రంపైనే ఆధారపడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రమాదకర వైఖరికి సాక్ష్యంగా కర్ణాటక నిలుస్తుందని చెప్పారు.
ఢిల్లీలోని ‘షాహీ’ కుటుంబానికి సేవ చేయడం కోసం నెంబర్ వన్ ఏటీఎంగా కర్ణాటకను తయారు చేసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. అయితే బీజేపీ మాత్రం కర్ణాటకను అభివృద్ధి చేయాలని కోరుకుంటోందని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని బీజేపీ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, మాన్యుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం రిటైర్‌మెంట్ పేరుతో ఓట్లు అడుగుతోందన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కోరుకుంటోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కాలంలో కర్ణాటక అస్థిరంగా ఉండేదన్నారు. ఆ పార్టీకి ఎస్‌డీపీఐ మద్దతిస్తోందన్నారు. మన దేశ సైన్యాన్ని ఆ పార్టీ దూషిస్తోందని, అగౌరవపరుస్తోందని చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులతో ఆ పార్టీ చేతులు కలుపుతోందని చెప్పారు.
ఇదిలావుండగా, మోదీ ఈ సభలో తన ప్రసంగాన్ని భారత్ మాతా కీ జై, బజరంగ్‌బలి కీ జై అనే నినాదాలతో ప్రారంభించారు. శాంతి, సద్భావనల సందేశాన్ని ఇచ్చే అందరు మఠాధిపతులు, తీర్థంకరులు, సాధు, సంతులకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నానని చెప్పారు. నేడు మనం ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అనే మంత్రంతో ముందుకు వెళ్తున్నామని, దీనికి సాధు, సంతుల ప్రేరణ ఉందని చెప్పారు.
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది : కేంద్ర మంత్రి రాజీవ్
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) మాట్లాడుతూ, కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ని నిషేధించిందని, దీనికి స్పందనగా కాంగ్రెస్ బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని చెప్తోందని మండిపడ్డారు. సిగ్గుమాలినతనానికి ఉన్న హద్దులన్నిటినీ దాటుకుని కాంగ్రెస్ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి :
MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు
Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..