Congress: కాంగ్రెస్ పార్టీకి అనిల్ ఆంటోని రాజీనామా
ABN , First Publish Date - 2023-01-25T11:32:54+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది....
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ(Congress leader AK Antony) కుమారుడు అనిల్ ఆంటోనీ(Anil K Antony) గురువారం రాజీనామా(Resigned) చేశారు. కాంగ్రెస్ పార్టీకి(Congress) చేసిన రాజీనామా లేఖను అనిల్ ఆంటోనీ ట్విట్టరులో పంచుకున్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేరళ రాష్ట్రంలో ప్రదర్శిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా అనిల్ ఆంటోనీ దాన్ని వ్యతిరేకించారు. అనిల్ ఆంటోనీ బీబీసీ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడే అని అనిల్ ఆంటోనే ఆరోపించారు. పార్టీ నిర్ణయంతో విభేదించిన అనిల్ ఆంటోనే కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.