Karnataka Election: కర్ణాటక సీఎం ఎవరో తేలేది ఎపుడంటే..?
ABN , First Publish Date - 2023-05-13T14:42:19+05:30 IST
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ మెజారిటీ మార్క్ దాటటంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆ పార్టీ నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో ఈనెల 14వ తేదీ ఆదివారంనాడు శాసనసభాపక్ష సమవేశం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ను ఎంచుకోనున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది.
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ దాటటంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆ పార్టీ నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో ఈనెల 14వ తేదీ ఆదివారంనాడు శాసనసభాపక్ష సమవేశం (Legislative party Meeting) ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత (Legislative part leader)ను ఎంచుకోనున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు దాటి గెలుచుకోనుందని, పూర్తి ఫలితాలు రావాల్సి ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం మధ్యాహ్నం తెలిపారు. సొంత బలంపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓవైపు ఫలితాలు వెలువడుతుండగానే ఆయన నివాసం వెలుపల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకొంటుకున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోతుండటంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలోనూ కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ పార్టీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. డీకే శివకుమార్ తన నివాసం నుంచే పార్టీ ఫలితాలను ఎప్పటికిప్పుడూ సమీక్షిస్తున్నారు.