Share News

Congress: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

ABN , First Publish Date - 2023-11-15T19:41:11+05:30 IST

Karanpur: రాజస్థాన్‌కి(Rajasthan) చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. పార్టీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్మీత్ సింగ్ కునార్(75)(Gurmeet Singh Koonar)ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Congress: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

జైపుర్: రాజస్థాన్‌కి(Rajasthan) చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. పార్టీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్మీత్ సింగ్ కునార్(75)(Gurmeet Singh Koonar)ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంత కాలంగా ఆయన మూత్ర పిండాలకు(Kidney Problems) సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గుర్మీత్ సింగ్ మృతి చెందారు. మూత్ర పిండాల వ్యాధితో పాటు, హైబీపీతో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై సీఎం అశోక్ గెహ్లోత్(Ashok Gahlot) సంతాపం తెలిపారు.


గహ్లోత్ మాట్లాడుతూ.. "కరణ్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుర్మీత్ సింగ్ కూనార్ మరణ వార్త నన్ను బాధించింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, తన ప్రాంతంలో అభివృద్ధి పనులకు నిరంతరం పాటుపడ్డారు, కునార్ మృతి కాంగ్రెస్ పార్టీకి, రాజస్థాన్ రాజకీయాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని అన్నారు.

ఆయన కరణ్ పూర్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లీడర్లలో ఆయనకూడా ఒకరు. కరణ్‌పూర్(Karanpur) నుంచి 1998 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన 2008లో ఆ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు.

Updated Date - 2023-11-15T19:41:49+05:30 IST