Karnataka Elections: అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు
ABN , First Publish Date - 2023-05-02T17:32:33+05:30 IST
అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను (Bajrang Dal) బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) తమ మ్యానిఫెస్టోలో (manifesto) ప్రకటించడం కలకలం రేపుతోంది.
బెంగళూరు, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) విజయం సాధించి అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను (Bajrang Dal) బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) తమ మ్యానిఫెస్టోలో (manifesto) ప్రకటించడం కలకలం రేపుతోంది. మైనారిటీ, మెజార్టీకి సంబంధం లేకుండా బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని వెల్లడించి ప్రకంపనలు రేపింది. మరోవైపు కాంగ్రెస్ హామీ సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట అని భారతీయ జనతా పార్టీ (BJP) మండిపడింది. బజరంగ్ బలీకి జై అనే నినాదాలు చేస్తే.. కాంగ్రెస్ అడ్డుకోవాలనుకోవడం హనుమంతుడిని అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన చెప్పారు.
అటు ఢిల్లీలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ హామీపై సంఘ్ పరివార్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎఫ్‌ఐని (Popular Front of India) బ్యాన్ చేయడం ద్వారా కర్ణాటకను బీజేపీ సురక్షితంగా ఉంచిందని కేంద్ర హోం మంత్రి ఇటీవలే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతుండటంతో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐని (PFI) నిషేధించింది.
మే 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పీఎఫ్‌ఐ, బజరంగ్ దళ్ అంశాలు కీలకం కానున్నాయి. మరో వారం రోజులు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉండటంతో బజరంగ్ దళ్ అంశంపై కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.
మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 113.