Corona mask: ఆ ప్రదేశాల్లో మాస్కు ధారణ తప్పనిసరి
ABN , First Publish Date - 2023-04-01T13:13:01+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో శనివారం నుంచి మాస్కు ధారణ తప్పనిసరి అని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M
పెరంబూర్(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో శనివారం నుంచి మాస్కు ధారణ తప్పనిసరి అని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) ప్రకటించారు. చెన్నైలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో శుక్రవారం 123 కేసులు, దేశవ్యాప్తంగా 3,095 కేసులు నమోదయ్యాయన్నారు. ఢిల్లీ, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, ప్రాథమిక దశలోనే నియంత్రించేలా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపా రు. ముఖ్యంగా, రకరకాల వ్యాధులతో బాధ పడుతున్నవా రు ఆసుపత్రులకు వస్తుంటారన్నారు. దీనిని దృష్టిలో ఉం చుకొని రాష్ట్రవ్యాప్తంగా 11 వేల ప్రభుత్వాసుపత్రుల్లో శనివారం నుంచి మాస్కుధారణ తప్పనిసరి చేశామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే వారంతా తప్పక మాస్కు ధరించే లా నిబంధనలువిధించినట్లు తెలిపారు.బహిరంగ ప్రాంతా ల్లో కూడా ప్రజలు మాస్కు ధరించాలని మంత్రి కోరారు.