Covid: కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు..
ABN , Publish Date - Dec 17 , 2023 | 07:37 AM
కరోనా(Covid) వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
- ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి గగన్‌దీప్‌సింగ్ బేదీ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): కరోనా(Covid) వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి గగన్‌దీప్ బేదీ(Gagandeep Bedi) అన్నారు. స్థానిక రామాపురంలోని ఎస్‌ఆర్‌ఎం డెంటల్ కళాశాలలో శుక్రవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన.. లాంఛనంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకూ ఎలాంటి అసాధారణ జ్వరాలు గుర్తించలేదన్నారు. ఇదిలా ఉండగా ఈ సదస్సులో దంతవృత్తిని నిరంతరం అభివృద్ధి చేయడం, సరైన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రాథమిక లక్ష్యంగా నడిచింది. వైద్యులు, విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా 55 పేపర్ ప్రజంటేషన్లు, 65 పోస్టర్ ప్రజంటేషన్లు, 22 టేబుల్ క్లినిక్‌లు, 75 క్విజ్ ఎంట్రీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణాచలం, డాక్టర్ అరుణ్‌మొళి, డాక్టర్ మోహాన్ చాకో, డాక్టర్ మిథున్‌జిత్, డాక్టర్ శివశంకర్, డాక్టర్ ఆనందకుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.