CPM: బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిట్లర్‌ పాలనే

ABN , First Publish Date - 2023-07-18T09:22:36+05:30 IST

వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశంలో హిట్లర్‌ పాలన సాగుతుందని సీపీఎం రాష్ట్ర

CPM: బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిట్లర్‌ పాలనే

అడయార్‌(చెన్నై): వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశంలో హిట్లర్‌ పాలన సాగుతుందని సీపీఎం రాష్ట్ర సీనియర్‌ నేత జి.రామకృష్ణన్‌(G. Ramakrishnan) అన్నారు. ఆయన తిరునెల్వేలిలో విలేకరులతో మాట్లాడుతూ... తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలోని పేద ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే పౌర ఉమ్మడి స్మృతి బిల్లును తెరపైకి తెచ్చిందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‌షా(Prime Minister Modi and Home Minister Amit Shah) ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినా ఓట్లు పడలేదన్నారు. అదేవిధంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోతుందన్నారు. బీజేపీ ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2023-07-18T09:22:36+05:30 IST