Share News

Cyclone Alert : తుపానుగా మారిన అల్పపీడనం.. ‘హమూన్‌’గా నామకరణం

ABN , First Publish Date - 2023-10-24T12:16:57+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ‘హమూన్‌’గా తుపానుకు నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో వర్షాలు కురవనున్నాయి.రేపు బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టాగాంగ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

Cyclone Alert : తుపానుగా మారిన అల్పపీడనం.. ‘హమూన్‌’గా నామకరణం

Delhi : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ‘హమూన్‌’గా తుపానుకు నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో వర్షాలు కురవనున్నాయి.రేపు బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టాగాంగ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. హమూన్‌ తుపాను కారణంగా భారత తీర ప్రాంతంపై..అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒడిశాపై నేరుగా ప్రభావం మాత్రం ఉండదు కానీ జాలర్లు ఎవరూ బుధవారం వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Updated Date - 2023-10-24T12:16:57+05:30 IST