Sanatana Dharma row: ఉదయనిధి స్టాలిన్‌కు నిర్మలా సీతారామన్ చాలెంజ్.. ఏంటో తెలుసా...

ABN , First Publish Date - 2023-09-17T11:57:10+05:30 IST

సనాతన ధర్మాన్ని (Sanatana Dharma row) నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్ర దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. తమిళనాడు మంత్రి చేస్తున్న ప్రకటనలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Sanatana Dharma row: ఉదయనిధి స్టాలిన్‌కు నిర్మలా సీతారామన్ చాలెంజ్.. ఏంటో తెలుసా...

న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని (Sanatana Dharma row) నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్ర దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. తమిళనాడు మంత్రి చేస్తున్న ప్రకటనలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ మీరు (ఉదయనిధి స్టాలిన్) రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేసి ఒక మంత్రి అయ్యారు. ఇతరుల విశ్వాసాలు, నమ్మకాల పట్ల గౌరవంగా నడుచుకుంటానని ప్రమాణం చేసేటప్పుడు స్పష్టంగా చెప్పారు. అది మీ సిద్ధాంతమే అయినప్పటికీ ఒక మతాన్ని ధ్వంసం చేస్తాననే హక్కు మీకు లేదు’’ అని నిర్మలా సీతారామన్ ఘాటువ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశఆరు.


ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అదే వేదికపై ఉన్న హిందూ రిలీజియన్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్స్ (HRCE) మంత్రి పీ.శేఖర్ బాబును ఆమె ప్రశ్నించారు. నాశనం చేస్తామని ఒక పక్కన చెబుతుంటే తమరెలా రక్షించగలరని అన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి వ్యతిరేకంగా ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నామన్నారు. ఇతర మతాల విషయంలో ఈ విధంగా మాట్లాడగలరా అని సీతారామన్ నిలదీశారు. ఇతర మతాలను ఆ విధంగా సంబోధిస్తే వివాదం ఉండకుండా పోతుందా అని అన్నారు. ఇతర మతాల్లో ఎలాంటి సమస్యలూ లేవా? ఇతర మతాల్లో మహిళలపట్ల దర్మార్గంగా వ్యవహరించడం లేదా? వాటిని ప్రశ్నించే దమ్ముందా? అని సీతారామన్ సవాళ్లు విసిరారు.

Updated Date - 2023-09-17T11:57:10+05:30 IST