DCM: వాటికి ఒక్కసారి అలవాటు పడితే బయటకు రాలేరు.. జాగ్రత్త..

ABN , First Publish Date - 2023-06-27T08:09:17+05:30 IST

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వాటికి బానిసలైతే జీవితాన్ని కోల్పోతారని ఉపముఖ్యమం

DCM: వాటికి ఒక్కసారి అలవాటు పడితే బయటకు రాలేరు.. జాగ్రత్త..

- విద్యార్థులకు డీసీఎం డీకే శివకుమార్‌ పిలుపు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వాటికి బానిసలైతే జీవితాన్ని కోల్పోతారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) హితవు పలికారు. ప్రపంచ మాదకద్రవ్య వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని సోమవారం క్రీడలు, యువజనుల శాఖ, గాంధీ స్మారక నిధి సంయుక్తంగా విధానసౌధ నుంచి కంఠీరవ స్టేడియం దాకా పాదయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు ఒక్కసారి అలవాటు పడితే బయటకు రాలేరన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు కట్టుబడ్డామన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. క్రీడలు, యువజనులశాఖ మంత్రి నాగేంద్ర, ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి శాలిని రజనీశ్‌, ఎమ్మెల్సీ నాగరాజ్‌ యాదవ్‌, గాంధీ స్మారకనిధి అధ్యక్షుడు ఉడే పీ కృష్ణ పాల్గొన్నారు.

ఏడాదిలో 6,191 డ్రగ్స్‌ కేసులు

బెంగళూరు నగరంలో ఏడాది వ్యవధిలో 6,191 డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌(Bangalore Police Commissioner Dayanand) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో 7,723 మందిని అరెస్టు చేశామని, వీరిలో 159 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసే వారిలో 943 మంది ఉన్నారని, సేవించేవారు 5,248 మంది ఉన్నారని వివరించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.117 కోట్లు ఉంటుందన్నారు. వీటిలో గంజాయి, గాంజా ఆయిల్‌, బ్రౌన్‌ షుగర్‌, హఫీం, ఎండీఎంఏ, సింథటిక్‌ డ్రగ్స్‌, వివిధ రకాల మాత్రలు, ఎల్‌ఎల్‌సీ స్ట్రిప్స్‌ ఉన్నాయన్నారు.

pandu3.2.jpg

Updated Date - 2023-06-27T08:09:17+05:30 IST