Delhi High Court: ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ABN , First Publish Date - 2023-01-26T19:03:43+05:30 IST
ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈడీకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని..
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈడీకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని, ఈడీ అధికారాలు అపరిమితమేమీ కాదని కోర్టు గుర్తుచేసింది. మనీలాండరింగ్ కేసులను మాత్రమే ఈడీ విచారించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీదాంట్లో ఈడీ జోక్యం తగదని ఛత్తీస్‌గడ్‌లోని కోల్‌బ్లాక్‌ల కేటాయింపుకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది.
సెక్షన్ 3 నేరాలను మాత్రమే పరిశోధించడానికి పిఎంఎల్ ఈడీకి అధికారం ఇచ్చిందని, ప్రతి దాంట్లో ఈడీ జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు హితవు పలికింది. విచారణ సందర్భంగా వేరే నేరాలు వెలుగులోకి వస్తే వాటిని సంబంధిత ఏజెన్సీలు మాత్రమే విచారించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.