Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త అరెస్ట్

ABN , First Publish Date - 2023-07-07T09:49:02+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త అరెస్ట్

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే నేడు ఆ అప్రూవర్‌ను ఈడీ (Enforcement Directorate) లిక్కర్ కేసులో అప్రూవర్‌ను అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దినేష్ అరోరాను ఈడీ అరెస్టు చేసింది. దినేష్ అరోరా ద్వారానే సౌత్ గ్రూపు నుంచి మనీష్ సిసోడియాకు ముడుపులు అందాయని అభియోగాలు మోపింది. రానున్న రోజుల్లో మనిషి సిసోడియాకు మరిన్ని చిక్కులు తలెత్తనున్నాయి. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఇప్పటికే మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును మనీష్ సిసోడియా ఆశ్రయించారు.

సుప్రీంలో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్..

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను విచారణ నిమిత్తం భౌతికంగా కోర్టుకు హాజరుపరచాలని రౌజ్‌ అవెన్యూ కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. తనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా భౌతికంగా హాజరు పరచాలంటూ ఆయన చేసిన వినతిని అంగీకరించింది. అయితే కోర్టు హాల్‌లోకి ఆప్‌ కార్యకర్తలు రాకూడదని, మీడియా ప్రతినిధులు దూరంగా ఉండాలని ఆంక్షలు విధించింది. సమర్థంగా వాదనలు వినిపించుకోవడానికి వీలుగా తాను కోర్టుకు హాజరయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఆయనకు భద్రత కల్పించలేమని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీనిని తోసిపుచ్చిన కోర్టు.. తదుపరి విచారణలకు సిసోడియాను స్వయంగా హాజరుపరచాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. మరోవైపు సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సిసోడియా గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2023-07-07T09:49:30+05:30 IST