Share News

Deputy Chief Minister: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ దాడులు

ABN , First Publish Date - 2023-10-14T09:03:40+05:30 IST

రాజకీయ దురుద్దేశం లేకుండా దేశంలో ఎక్కడా ఐటీ దాడులు జరగడం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు.

Deputy Chief Minister: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ దాడులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజకీయ దురుద్దేశం లేకుండా దేశంలో ఎక్కడా ఐటీ దాడులు జరగడం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బెంగళూరు ఐటీ దాడుల వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఐటీ దాడులు సర్వసాధారణంగా మారాయని, వీటి వెనుక రాజకీయ దురుద్దేశ్యాలు ఉంటున్నాయన్నారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కర్ణాటక నుంచే నిధులు తరలివెళుతున్నాయన్న బీజేపి నేత అశ్వత్థనారాయణ వాఖ్యలను డీసీఎం తీవ్రంగా ఖండించారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ రైతుల కంటే తమ పరిస్థితి దయనీయంగా ఉందని, దర్యాప్తును పక్కన పెట్టి పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని చేసిన డిమాండ్‌పై ఆయన స్పందించారు. పనుల ప్రాధాన్యతకు అనుగుణంగా 60 నుంచి 70 శాతం బిల్లు బకాయిలను విడుదల చేశామని, ఈ విషయంలో ప్రభుత్వం న్యాయసమ్మతంగానే ముందుకు వెళుతుందన్నారు. కాగా రాష్ట్రంలో వర్షాభావ స్థితి కారణంగానే లోడ్‌షెడ్డింగ్‌ ఉందని అయితే ఇది తాత్కాలికమేనని త్వరలోనే పరిస్ధితులన్నీ చక్కదిద్దుకుంటాయని ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-14T09:03:40+05:30 IST