Share News

Deputy Chief Minister: మీ భూముల్ని అమ్ముకోవద్దు.. కనకపుర బెంగళూరులో కలవడం ఖాయం

ABN , First Publish Date - 2023-10-25T13:01:42+05:30 IST

రాజధాని బెంగళూరు నగరం అతి వేగంగా విస్తరిస్తోందని రానున్న రోజుల్లో కనకపుర కూడా నగరంలో కలసిపోయే అవకాశం

Deputy Chief Minister: మీ భూముల్ని అమ్ముకోవద్దు.. కనకపుర బెంగళూరులో కలవడం ఖాయం

- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరం అతి వేగంగా విస్తరిస్తోందని రానున్న రోజుల్లో కనకపుర కూడా నగరంలో కలసిపోయే అవకాశం ఉందని అప్పుడు భూముల ధర బం గారం అవుతుందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు. త్వరపడి భూములు అమ్ముకోవద్దని ఆయన రైతులను కోరారు. కనకపుర తాలూకాలోని శివనహళ్ళి గ్రామంలో వీరభద్రస్వామి దేవస్థాన జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం మాట్లాడుతూ కనకపురలో కేఎంఎఫ్‌ డైరీ ఉందని, అత్యాధునిక ఆసుపత్రులు, ఉన్నత విద్యాసంస్థలు, పలు వ్యాపారసంస్థలు ఉన్నాయన్నారు. బెంగళూరు నగర పరిధి క్రమేపీ విస్తరించుకుంటే కనకపుర ఎంతో దూరం కాబోదన్నారు. రామనగర జిల్లాలో ఉన్నా కనకపుర, బెంగళూరుకు సమీపంలో ఉండడమే ఇందుకు కారణమన్నారు. హిందూమతంలో ఎన్నో పురాతన ఆలయాలు, మహిమాన్విత దేవుళ్లు ఉన్నారని పేర్కొన్న ఆయన దేవుళ్లకు నిత్య కైంకర్యాలు జరిగితే వీరి అనుగ్రహం ప్రజలపై మెండుగా ఉం టుందన్నారు. కాంగ్రెస్‌ అన్ని మతాలను సమానంగా చూస్తూ గౌరవిస్తుందన్నారు. కనకపుర నుంచి తనను 8సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనన్నారు. నియోజకవర్గంలోని పురాతన ఆలయాలన్నింటినీ దశల వారీగా జీర్ణోద్ధరణ జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని దీనిపై త్వరలో దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డితో చర్చలు జరుపుతానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పీజీఆర్‌ సింధియా, తుమకూరు సిద్దగంగామఠాధిపతి సిద్దలింగ స్వామిజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మైసూరులోని సుత్తూరు మఠాన్ని సందర్శించి మఠాధిపతి శివరాత్రి దేశికేంద్రస్వామిజీ ఆశీస్సులు పొందారు

Updated Date - 2023-10-25T13:01:42+05:30 IST