Deputy CM DK Shivakumar: మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?

ABN , First Publish Date - 2023-08-20T10:49:15+05:30 IST

మీరు చేస్తే అది ఒప్పు... కానీ మేం చేస్తే తప్పు ఎలా అవుతుందంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) బీజేపీని

Deputy CM DK Shivakumar: మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?

- బీజేపీకి డీకే శివకుమార్‌ సూటి ప్రశ్న

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మీరు చేస్తే అది ఒప్పు... కానీ మేం చేస్తే తప్పు ఎలా అవుతుందంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం నగర పర్యటన చేపట్టి పలు కార్య క్రమాల్లో పాల్గొన్నారు. ఈజీపుర ఫ్లై ఓవర్‌, బనశంకరి బస్టాండ్‌ సర్కిల్‌, ఇట్టిమడులో నిర్మిస్తున్న రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాట్లు, గాంధీ బజార్‌లో జరుగుతున్న స్మార్ట్‌ సిటీ పనులను పరిశీలించారు. ఈజీపుర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీని లాంఛనంగా శ్రీకారం చుట్టారు. అనంతరం ఈజీపుర ఫ్లై ఓవర్‌ పనుల ప్రగతిని పరిశీలించారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి(Minister Ramalinga Reddy), నగరాభివృద్ధిశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాకేశ్‌ సింగ్‌, బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. పనుల నాణ్యతపై దృష్టి సారించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బనశంకరి బస్టాండ్‌ సర్కిల్‌, మెట్రో స్టేషన్‌ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈజీపుర ఫ్లై ఓవర్‌ మూడు కిలోమీటర్ల మేరకు ఉందని 2017 నుంచి పనులు జరుగుతున్నా కేవలం 35శాతం మాత్రమే పూర్తయ్యిందని ఆయన తెలిపారు. కంట్రాక్టు కంపెనీ కారణంగానే సమస్య తలెత్తిందని అధికారులు ఫిర్యాదు చేసిన తక్షణం నోటీసు జారీ చేసి టెండరు రద్దు చేశామన్నారు. ఈ ఫ్లై ఓవర్‌తోపాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు రూ.100 కోట్లు విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదన చేశారన్నారు. నిధులు వెసలబాటు చూసుకుని పనులను పూర్తి చేస్తామన్నారు. కాగా రాజకీయాల్లో ఫిరాయింపులు ఇప్పటివి కావన్నారు. కర్ణాటకలోనూ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలోనూ ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి అక్రమంగా అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు దెయ్యిలు వేదాలు వల్లించి నట్టుగా ఉందంటూ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలనుంచి ప్రజలను దారి తప్పించేందుకే ఆపరేషన్‌ హస్తకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతిపక్షాల ఆరోపణను తోసి పుచ్చారు.

తిరువళ్ళూర్‌ ఎంపీ భేటీ

కావేరి జల వివాదం రగులుతుండగానే తమిళనాడుకు చెందిన తిరువళ్ళూరు ఎంపీ కే జయకుమార్‌(MP K Jayakumar) శనివారం సదాశివనగర్‌లోని ఉపముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. ఆయనతో కొద్దిసేపు చర్చలు జరిపారు. జరిగిన చర్చలు వివరాలు తెలియరాలేదు. డీసీఎంను కలసిన ప్రముఖులలో ఇస్రో మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ శివంతాను పిళ్ళై కూడా ఉన్నారు.

pandu4.jpg

Updated Date - 2023-08-20T10:49:15+05:30 IST