Deputy CM: ‘ఆపరేషన్‌ హస్త’ ఆలోచన లేదు.. అయితే.. వస్తామంటే మాత్రం వద్దనం

ABN , First Publish Date - 2023-09-28T11:53:55+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి స్థిరమైన ప్రభుత్వాన్ని అందించేంత మెజారిటీ ఉందని ఆపరేషన్‌ హస్త జర పాల్సిన అవసరం లేదని కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు.

Deputy CM: ‘ఆపరేషన్‌ హస్త’ ఆలోచన లేదు.. అయితే.. వస్తామంటే మాత్రం వద్దనం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి స్థిరమైన ప్రభుత్వాన్ని అందించేంత మెజారిటీ ఉందని ఆపరేషన్‌ హస్త జర పాల్సిన అవసరం లేదని కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం జేడీఎస్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారిని సాదరంగా పార్టీలోకి స్వాగతించిన అనంతరం ఆయన ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మరింతగా మారిపోయే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో తమకు సిద్ధాంతాలతో పనిలేదని బీజేపీతో పొత్తు ద్వారా జేడీఎస్‌ చాటుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో జేడీఎస్‌ నేతలు, కార్య కర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇలా వస్తామంటే మాత్రం తాము వద్దనబోమన్నారు. జేడీఎస్‌ కార్యకర్తల చేరికతో అనేక లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ మరింత బలోపేతం కానుందన్నారు. కాగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నవారిలో ఆశ్రయ సమితి మాజీ అధ్యక్షుడు కేఎం హొంబేగౌడ, ఏపీఎంసీ సభ్యుడు టీఏ మూర్తి, రిటైర్డు అధికారి రాజు, పారిశ్రామికవేత్త తిమ్మే గౌడ తదితరులు ఉన్నారు. యశ్వంతపుర నియోజకవర్గం నుంచి సుమారు 70మంది జేడీఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

pandu4.jpg

కేఆర్‌ఎస్‌ నీటి విడుదల ప్రశ్నే లేదు

కావేరి జల నిర్వహణ ప్రాధికార ఉత్తర్వుల మేరకు 3వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నామని ఇందులో 2వేల క్యూసెక్కుల నీరు దానంతటదే ప్రవహిస్తుందని, మిగిలిన వెయ్యి క్యూసెక్కుల నీటికోసం ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేఆర్‌ఎస్‌ రిజర్వాయర్‌ నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేసే ప్రశ్నే లేదన్నారు. బీజేపీ, జేడీఎస్‌ నేతలు మేకెదాటు ప్రాజెక్టుకోసం ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని డీసీఎం సూచించారు.

Updated Date - 2023-09-28T11:53:55+05:30 IST