DGP: కొత్త డీజీపీ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-26T13:42:34+05:30 IST

కర్ణాటక రాష్ట్ర నూతన డీజీపీ అలోక్‌మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ...

DGP: కొత్త డీజీపీ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : పోలీసులు పొట్టలు తగ్గించుకోవాలని ఫిట్‌నెస్‏ను పెంపొందించుకోవాలని కొత్త డీజీపీ అలోక్‌మోహన్‌(DGP Alok Mohan) ఆదేశించారు. గురువారం బెంగళూరు నగర కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు మార్గదర్శకాలను, భధ్రత విషయంలో పాటించాల్సిన సూత్రాలను వివరించారు. తొలుత అధికారులు ఫిట్‌నెస్‏గా ఉండాలని ఆతర్వాతనే సిబ్బందికి సూచించాల్సి ఉంటుందన్నారు. నగరానికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించానన్నారు. నగరంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జరిగే పరిణామాలు ఇక్కడికే పరిమితం కావని అంతర్జాతీయ స్థాయికి చేరుతాయనేది గుర్తెరగాలన్నారు. రౌడీలను అణిచివేయాల్సిందే అన్నారు. రౌడీయిజం, గూండాయిజానికి అవకాశం ఇవ్వరాదన్నారు. పోలీసులు జనస్నేహిగా ఉండాల్సిందే అన్నారు. పోలీసుస్టేషన్‌లకు ఫిర్యాదులతో వచ్చేవారి పట్ల సమగ్ర సమాచారం తీసుకోవాలని విసుగుతో మాట్లాడరాదన్నారు. రానున్న రోజుల్లో రౌడీలు లేని నగరంగా తీర్చాల్సిందే అన్నారు. డ్రగ్స్‌ వ్యాపారాల పట్ల ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. స్టేషన్‌లలో కూర్చొని పర్యవేక్షిస్తామంటే సరిపోదని ప్రతి ఎసీపీ కూడా వారి పరిధిలోని స్టేషన్‌లను రోజుకోసారి అయినా వెళ్ళాల్సిందే అన్నారు. ప్రతి స్టేషన్‌ పరిధిలోను డీసీపీల పర్యవేక్షణ పెరగాలన్నారు. నగర పోలీసు కమిషనర్‌ ప్రతాపరెడ్డి సహా ట్రాఫిక్‌, సివిల్‌ విభాగాలకు చెందిన డీసీపీలు, ఎసీపీలు భాగస్వామ్యులయ్యారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-26T13:42:34+05:30 IST