Chandrayaan 3: చంద్రయాన్-2, చంద్రయాన్-3 మధ్య తేడాలు ఏంటి? మళ్లీ ఆ తప్పులు జరిగే ప్రమాదం ఉందా?
ABN , First Publish Date - 2023-08-22T16:39:06+05:30 IST
ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. ఇంతకుముందు చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో.. ఈసారి అలా జరగకూడదని, చంద్రయాన్-3 విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇది చంద్రుడిపై..
ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. ఇంతకుముందు చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో.. ఈసారి అలా జరగకూడదని, చంద్రయాన్-3 విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇది చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్‌ఫుల్ అయితే.. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. మరి.. ఇది సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా? సరికొత్త చరిత్ర సృష్టించగలుగుతుందా? ఇంతకీ చంద్రయాన్2, చంద్రయాన్-3 మధ్య తేడాలేంటి? గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరిగే ప్రమాదం ఉందా? పదండి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
ఇంతకుముందు ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమవ్వడానికి కారణం.. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపమే! ఈ లోపం వల్ల విక్రమ్ రోవర్ చంద్రుని ఉపరితలం నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రోకి ఎలాంటి సమాచారం అందలేదు. సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తద్వారా ల్యాండర్ చంద్రునిపై కుప్పకూలిపోయింది. నిజానికి.. నాలుగో దశలో భాగంగా ల్యాండర్ వేగాన్ని 6000 Kmph నుంచి 0 Kmphకు ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించాలి. ఆ పని చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగానే ఉన్నారు కానీ, సాఫ్ట్‌వేర్‌లో లోపం తలెత్తింది. ప్లాన్ ప్రకారం.. 55 డిగ్రీలుగా ఉండాల్సిన ట్రాజెక్టరీని విక్రమ్ రోవర్ 410 డిగ్రీలకు మార్చుకుంది. దాంతో.. ల్యాండర్‌కు, ఇస్రోకి మధ్య సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలు దాని వేగాన్ని నియంత్రించలేకపోయారు. అయితే.. చంద్రయాన్ 2 విఫలమైనా, దాని ఆర్బిటర్ ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది.
ఇక చంద్రయాన్-3 విషయానికొస్తే.. దీనిని ఆర్బిటర్ లేకుండానే ప్రయోగించారు. ఇప్పటికే ఇది చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోకి ప్రవేశించింది కూడా! ఇందులో స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పరికరం ఉంది. ఇది చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేస్తుంది. అంతేకాదు.. చంద్రయాన్-3 తన ట్రాజెక్టరీని సరిగ్గా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు.. చంద్రయాన్-3లో ప్రమాదాలను గుర్తించే 2 కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే.. ఇది లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (LRA)ని కలిగి ఉంది. చంద్ర వ్యవస్థ డైనమిక్‌లను అర్థం చేసుకోవడానికి ఇది ద్వితీయ ప్రయోగంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చంద్రయాన్-3 విఫలమయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ.