Amrithsar to Kullu: అమృత్‌సర్ నుంచి కులుకి డైరెక్ట్ ఫ్లైట్.. ప్రారంభం ఎప్పటి నుంచంటే?
ABN , First Publish Date - 2023-09-27T16:34:17+05:30 IST
అలయన్స్ ఎయిర్ అక్టోబరు 1 నుంచి నేరుగా అమృత్‌సర్ నుంచి కులుకి విమానాలు నడపనుంది. వారానికి 3 సార్లు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 1 నుంచి నేరుగా సిమ్లా, అమృత్ సర్ లకు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్రవారాల్లో కులుకు వెళ్లే విమానం నడుస్తుంది.
పంజాబ్: అలయన్స్ ఎయిర్ అక్టోబరు 1 నుంచి నేరుగా అమృత్‌సర్ నుంచి కులుకి విమానాలు నడపనుంది. వారానికి 3 సార్లు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 1 నుంచి నేరుగా సిమ్లా, అమృత్ సర్ లకు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్రవారాల్లో కులుకు వెళ్లే విమానం నడుస్తుంది. ఇందుకు సంబంధించి అలయన్స్ ఎయిర్ సంస్థ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది.
విమానం కులు నుండి ఉదయం 8.25 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. అమృత్‌సర్ నుండి తిరిగి ఉదయం 10 గంటలకు బయలుదేరి 11.05 గంటలకు కులు చేరుకుంటుంది. ఈ మార్గంలో 50 శాతం సీట్లకు సబ్సిడీ ఉంటుంది. కులు నుండి అమృత్‌సర్‌కి విమానానికి రూ.2 వేల 637, అమృత్‌సర్ నుండి కులుకి రూ.3 వేల 284 ఖర్చు అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. 'అమృత్‌సర్‌లోని విమానాశ్రయానికి దేశ నలుమూలల నుంచి నేరుగా కనెక్టివిటీ ఉంది. ఇది దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కలిపే కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది. ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి హెలిప్టర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని సుఖు చెప్పారు. జుబ్బర్‌హట్టి (సిమ్లా), భుంతర్ (కులు), గగ్గల్ (కంగ్రా) వద్ద ఉన్న మూడు విమానాశ్రయాలతో పాటు, రాష్ట్ర విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి కాంగ్రా విమానాశ్రయాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతుయన్నారు.