DK Shivakumar: కీలక పదవులన్నీ ఆయన దగ్గరే..
ABN , First Publish Date - 2023-06-10T13:09:40+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు, తర్వాత శాఖలు, తాజాగా జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యనే
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు, తర్వాత శాఖలు, తాజాగా జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యనేత డీకే శివకుమార్(DK Shivakumar)కు కీలకమైన పదవులు వరించాయి. ఆయన ముఖ్యమంత్రి కావాలని భావించారు. అయితే సమీకరణల నేపథ్యంలో సిద్దరామయ్య సీఎం అయ్యారు. దీంతో డీకే శివకుమార్ కోరుకున్న పదవులకు ఎదురే లేదనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. డీసీఎం(DCM)గా కీలకమైన జలవనరుల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధి శాఖలు దక్కాయి. వీటితోపాటు తాజాగా బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రి పదవి కూడా వరించింది. ఇవన్నీ ప్రభుత్వానికి అనుబంధమైన పదవులు కాగా పార్టీకి సంబంధించి కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంత్రివర్గంలో ఎక్కువ మంది జలవనరులు, బెంగళూరు అభివృద్ధి మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. కానీ వారెవ్వరికీ దక్కకుండా డీకే శివకుమార్‌కు కేటాయించారు. ఇన్‌చార్జ్ మంత్రి పదవి కోసం సీనియర్ మంత్రులు రామలింగారెడ్డి, కేజే జార్జ్, కృష్ణభైరేగౌడ ప్రయత్నించారు. కానీ బెంగళూరు అభివృద్ధి శాఖ డీకే శివకుమార్(DK Shivakumar) వద్ద ఉన్న మేరకు రాజధానికి ఇన్‌చార్జ్ మంత్రి కూడా ఆయనే అయ్యారు.