DK Shivakumar: ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాటలొద్దు.. సాక్ష్యాలుంటే ఇవ్వండి

ABN , First Publish Date - 2023-07-14T08:55:43+05:30 IST

బీడీఏలో అవినీతి రాజ్యమేలుతోందని వేల కోట్ల అక్రమాలు జరిగాయని కొందరు అధికారుల సూత్రధారులనే ఉత్తుత్తి మాటలొద్దని సాక్ష్యాలుం

DK Shivakumar: ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాటలొద్దు.. సాక్ష్యాలుంటే ఇవ్వండి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీడీఏలో అవినీతి రాజ్యమేలుతోందని వేల కోట్ల అక్రమాలు జరిగాయని కొందరు అధికారుల సూత్రధారులనే ఉత్తుత్తి మాటలొద్దని సాక్ష్యాలుంటే ఇవ్వాలని చర్యలు తీసుకుంటానని బెంగళూరు నగరాభివృద్ది శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్‌(DK Shivakumar) వెల్లడించారు. గురువారం పరిషత్‌లో పలు ప్రశ్నలకు డీకే శివకుమార్‌ సమాధానాలు ఇచ్చారు. జేడీఎస్‌ సభ్యుడు శరవణ మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ది ప్రాధికార అవినీతి ఇంతింత కాదయా అనేలా ఉందని ప్రస్తావించారు. లేఅవుట్‌లను వేలం లేకుండా కేటాయించరాదనే నిబంధనలు ఎక్కడా పాటించలేదని మండిపడ్డారు. 2019 నుంచి ఎన్ని ప్లాట్లు ప్రాధికార నుంచి పంపిణీ చేశారని ప్రశ్నించారు. బీడీఏ చేసే అవినీతి అక్రమాలకు అదుపులేకుండా పోయిందన్నారు. తీవ్రంగా స్పందించిన డీసీఎం ఉత్తుత్తి మాటలు, ప్రసంగాలు వద్దన్నారు. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. సాక్ష్యాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులకు పరిహారమా?

పరిశ్రమల ఏర్పాటుకు అనువైన, ప్రభుత్వ భూములను ఎంపిక చేయడం ఆనవాయితీ ఉందని కానీ ప్రభుత్వ భూమి పేరుతో ప్రైవేటు వ్యక్తులకు రూ.24 కోట్ల పరిహారం ఇచ్చారంటూ జేడీఎస్‌ సభ్యుడు మరితిబ్బేగౌడ మండిపడ్డారు. అధికారులు విజయ్‌కుమార్‌, అజిత్‌రై వంటి వారిపై ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు పరిహారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాగా బెంగళూరు అక్రమాలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ శుభపరిణామమేనని కానీ చర్యలు ఉండాలన్నారు. బొమ్మనహళ్ళి మూడువేల కోట్ల బీబీంపీ ఆస్తిని కొందరు అధీనంలో ఉంచుకున్నారని పోలీసులు వారికే మద్దతు ఇస్తున్నారన్నారు. డీసీఎం సమాధానమిస్తూ ప్రభుత్వ భూమికి పరిహారం తీసుకున్నవారిపై చర్యలు ఉంటాయని బొమ్మనహళ్ళిలో 3వేల కోట్ల ఆస్తికి రక్షణ కల్పిస్తామన్నారు.

ఆరు దశాబ్దాలుగా జాప్యం

కృష్ణా ఎగువ ప్రాజెక్టు నిర్మాణాలు మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్ర్తి కాలంలో జరిగిందని ఆరు దశాబ్దాలైనా ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాలేదని బీజేపీ సభ్యుడు పీహెచ్‌ పూజార్‌ మండిపడ్డారు. జలవనరుల శాఖా మంత్రి హోదాలో డీకే శివకుమార్‌ మాట్లాడుతూ సమస్య తెలుసని గత ప్రభుత్వం 5వేల కోట్లు అవసరంగా ప్రకటించిన తర్వాత బొమ్మై బడ్జెట్‌లో కేవలం రూ.1200 కోట్లు కేటాయించారని ప్రస్తుతం సిద్దరామయ్య కూడా అంతే మొత్తం బడ్జెట్‌లో ప్రస్తావించారన్నారు. గ్యారెంటీ పథకాలు ఉన్నందున ఆలోచించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సహకరించినట్లుగా కేంద్రం కర్ణాటకకు అనుకూలంగా లేదన్నారు. రాష్ట్రానికి చెందిన 28 మంది ఎంపీలు గట్టిగా పోరాడి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2023-07-14T08:55:43+05:30 IST