Share News

DK Shivakumar: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు నన్నేమీ చేయలేవు

ABN , First Publish Date - 2023-10-20T12:21:32+05:30 IST

బీజేపీ ఎ న్ని విధాలుగా కుట్రలు కుతంత్రాలు పన్నినా తనను ఏమీ చేయలేరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar)

DK Shivakumar: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు నన్నేమీ చేయలేవు

- రాజీనామా చేసే ప్రసక్తే లేదు..

- కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉంది

- డీసీఎం డీకే శివకుమార్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎ న్ని విధాలుగా కుట్రలు కుతంత్రాలు పన్నినా తనను ఏమీ చేయలేరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్ధానాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని అంతిమ విజయం తనదేనని పేర్కొన్నారు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ 90 శాతం విచారణను పూర్తిచేసినట్లు చెబుతోందని అయితే తన ఆస్తులు, తన భార్య ఆస్తులపై సీబీఐ ఇంతవరకు వివరణ ఇవ్వలేదన్నారు. తనను విచారణకు పిలవకుండా 90 శా తం విచారణ ఎప్పుడు పూర్తిచేశారో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ సరిగ్గాలేదని తాను హైకోర్టులో అప్పీలు చేశానన్నారు. యడియూరప్ప(Yeddyurappa) ప్రభుత్వ హయాంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారని ఆయన ఆరోపించారు. తనపై హైకోర్టు ఆదేశాలు వెలువడుతూనే బీజేపీ జేడిఎస్‌ నేతలు సంబరాలు జరుపుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నారని సరైన సమయంలో వీటన్నింటికీ సమాధానం చెప్పే శక్తి తనకు ఉందన్నారు. తనను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్ర స్తావిస్తూ వారేమైనా న్యా యమూర్తులా అని ఆయన ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-10-20T12:21:32+05:30 IST