DK Shivakumar: వందరోజుల్లోగా ‘ఎత్తినహొళె’ ప్రాజెక్టుకు శ్రీకారం

ABN , First Publish Date - 2023-08-23T10:46:57+05:30 IST

ఎత్తినహొళె (ఎత్తిపోతల పథకం) ప్రాజెక్టు తొలిదశను మరో వంద రోజుల్లోగా ప్రారంభించి నీటిని పంపింగ్‌ చేయనున్నట్టు జలవనరులశాఖ

DK Shivakumar: వందరోజుల్లోగా ‘ఎత్తినహొళె’ ప్రాజెక్టుకు శ్రీకారం

- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎత్తినహొళె (ఎత్తిపోతల పథకం) ప్రాజెక్టు తొలిదశను మరో వంద రోజుల్లోగా ప్రారంభించి నీటిని పంపింగ్‌ చేయనున్నట్టు జలవనరులశాఖ నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ప్రకటించారు. హాసన్‌ జిల్లా సకలేశపుర సమీపంలోని హెబ్బనహళ్లి ప వర్‌ సబ్‌స్టేషన్‌, దొడ్డనాగర పంప్‌హౌస్‌ వద్ద జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు జలవనరులశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశ్వేశ్వరయ్య జలమండలి ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ కనుమల్లో ప్ర వహించే నీటిని మళ్లించి కోలారు వరకు 24 టీఎంసీలను అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. గతంలో తాను జలవనరులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించానని, ప్ర గతి చాలా నిరాశాజనకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ప్రా జెక్టు అంచనా వ్యయం రూ.24వేల కో ట్లకు పెరిగిందన్నారు. ప్రాజెక్టు చాలా నిదానంగా కొనసాగుతుండడానికి నిధుల కొరతే కారణమన్నారు. ఈ సమస్యకు తమ ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని వెతికిందన్నారు. విద్యుత్‌, అటవీశాఖ అధికారులతో చర్చించి కొన్ని సమస్యలకు పరిష్కారం చూ పామని తెలిపారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చోట లోడ్‌షెడ్డింగ్‌ జరపాలని తనకు చెప్పారన్నారు.

ప్రజలకు ఇబ్బం ది కలిగించవద్దని సూచించానన్నారు. ప్రాజెక్టు కోసం రెవెన్యూ భూముల వివాదం సాధ్యమైనం త త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారికి సూ చించానని పేర్కొన్నారు. మూడున్నర సంవత్సరాలుగా ఎత్తినహొళె ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందని, రాజకీయ చిత్తశుద్ధి లోపించడమే కారణమన్నారు. ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు రూ.14వేల కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశామని, జాప్యం అధికం కావడంతో ఏకం గా రూ.10వేలకోట్లు పెరిగిందని వివరించారు. కాగా బీబీఎంపీ పరిధిలో రూ.25లక్షల వరకు బకాయి బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తమిళనాడు(Tamil Nadu)కు కావేరి జలాల విడుదలకు నిరసగా జరుగుతున్న పోరాటాల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. కావేరి జలాల నిర్వహణా ప్రాధికారి సూచన ప్రకా రం భారీ వర్షాలు కురిసే సమయంలో కోటా ప్రకారం 70 టీఎంసీల నీటిని, వర్షాభావం ఉన్న సమయంలో 32 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే తమిళనాడుకు 24 టీఎంసీలు విడుదల చేశామన్నారు. ఇంకా 8.5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందన్నారు. బుధవారం జరిగే అఖిల పక్ష సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

pandu3.jpg

Updated Date - 2023-08-23T10:46:57+05:30 IST