DK Shivakumar: తప్పదు.. రింగ్‌ రోడ్డు నిర్మించే తీరతాం..

ABN , First Publish Date - 2023-08-01T13:28:13+05:30 IST

బెంగళూరులో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పెరిఫెరల్‌ రింగ్‌ రోడ్డు అత్యవసరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు పనులను ఆపలేమని డీసీఎం, బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రి డీకే శివకుమార్‌(Minister DK Shivakumar) వెల్లడించారు.

DK Shivakumar: తప్పదు.. రింగ్‌ రోడ్డు నిర్మించే తీరతాం..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పెరిఫెరల్‌ రింగ్‌ రోడ్డు అత్యవసరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు పనులను ఆపలేమని డీసీఎం, బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రి డీకే శివకుమార్‌(Minister DK Shivakumar) వెల్లడించారు. జ్ఞానభారతి ఆడిటోరియంలో సోమవారం పెరిఫెరల్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు రైతులు, భూ యజమానులతో చర్చాగోష్టి నిర్వహించా రు. ఈ సందర్భంగా డీసీఎం మాట్లాడుతూ సొంత భూమిని కాపాడుకోవడం, ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల అన్నారు. కానీ నగరంలో అంతకంటే ఇబ్బందికరంగా మారుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న భూములకు ఎన్‌ఓసీ ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పారు. కానీ భూములు కోల్పోయినవారికి ప్రత్యామ్నాయంగా తగిన భూమిని అప్పగించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణాల్లో భూమిని కోల్పోయే ప్రతి రైతు, యజమానికి న్యాయం చేస్తామన్నారు. ఏ విధంగా ప్రత్యామ్నాయం సమకూర్చాలనేది పరిశీలిస్తామని చెప్పారు. అందరి సలహాలపై కేబినెట్‌లోనూ చర్చిస్తామన్నారు. మీ రక్షణకు తాను ఉన్నా అని భరోసా ఇచ్చారు.

2007లో పెరిఫెరల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గెజిట్‌ జారీ అయిందని, అప్పట్లోనే భూస్వాధీనం ముగించి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కావన్నారు. కోర్టు కూడా భూ స్వాధీనాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. బీడీఏ కోసం కొత్త చట్టం తీసుకురాలేమన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా భూమి సేకరించేందుకు గెజిట్‌ జారీ చేసే పరిస్థితిలో లేదని తెలిపారు. తన సొంతభూ మి కూ డా అక్రమణలో ఉందని, ప్రస్తుతం కొత్తగా డీ నోటిఫికేషన్‌ సాధ్యం చేయలేమన్నారు. పెరిఫెరల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు కానుందని, ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల భూమి ధర ఐదు రెట్లు పెరగుతుందన్నారు.

Updated Date - 2023-08-01T13:38:43+05:30 IST