DK Shivakumar: తప్పు చేయనప్పుడు మీకు భయమేల రాజా..?
ABN , First Publish Date - 2023-08-29T10:07:11+05:30 IST
తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏం ఉందని బీజేపీ నాయకులను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar)
- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏం ఉందని బీజేపీ నాయకులను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ప్రశ్నించారు. 40 శాతం కమీషన్ వ్యవహారాలు, కొవిడ్ సమయంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణకు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి బీజేపీ నేతల్లో వణుకు ప్రారంభమైందన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయని, స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలాంటి ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. దర్యాప్తు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యాలు లేవన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని, ఇందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఆయన సూచించారు. బీజేపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలముందు ఉంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. మైసూరులో ఈనెల 30న జరిగే రాహుల్‌గాంధీ కార్యక్రమానికి పార్టీ నేతలంతా హాజరవుతారన్నారు.