Share News

Gaumutra states: 'గోమూత్ర' రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుపు... లోక్‌సభలో డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-05T18:41:26+05:30 IST

ద్రవిడ మున్నేట్ర కళగం ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందీ భాషా రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు.

Gaumutra states: 'గోమూత్ర' రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుపు... లోక్‌సభలో డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ (DNV Senthilkumar) లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందీ భాషా రాష్ట్రాలను 'గోమూత్ర' (Gaumutra) రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు.


తమిళనాడులోని ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గానికి సెంథిల్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభలో జమ్మూ కశ్మీర్ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందీ భాష మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఈ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంటుందన్నారు. హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


మండిపడిన మీనాక్షి లేఖి..

ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ ఖండించారు. ఎంపీ వ్యాఖ్యలు సమానత ధర్మాన్ని అవమానించడమేనని చెప్పారు. త్వరలోనే డీఎంకేకు గోమూత్రం వల్ల లాభాలు ఏంటో తెలుస్తాయన్నారు. దేశ ప్రజలు ఇలాంటి ద్వేషుల్ని సహించరని, తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.


కాంగ్రెస్ స్పందనిదే..

కాగా, గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ కుమార్ రంజన్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు, అది వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పార్లమెంటులో ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినప్పపుడు దాంతో తమకు సంబంధం ఉండదన్నారు. తాము (కాంగ్రెస్) గోమాతను గౌరవిస్తామని చెప్పారు.

Updated Date - 2023-12-05T18:41:27+05:30 IST