Drone Police Unit: రాష్ట్ర హోం శాఖ చరిత్రలో మరో మైలురాయి.. డ్రోన్‌ పోలీస్‌ యూనిట్‌

ABN , First Publish Date - 2023-06-30T08:55:10+05:30 IST

రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో మరో మైలురాయి ‘డ్రోన్‌ పోలీసు యూనిట్‌’ అని డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) తెలిపారు. స్థానిక అడ

Drone Police Unit: రాష్ట్ర హోం శాఖ చరిత్రలో మరో మైలురాయి.. డ్రోన్‌ పోలీస్‌ యూనిట్‌

- కృత్రిమ మేథో సంపత్తి, ఆధునిక పరిజ్ఞానం

- నేరాల నియంత్రణలో సహకారం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో మరో మైలురాయి ‘డ్రోన్‌ పోలీసు యూనిట్‌’ అని డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) తెలిపారు. స్థానిక అడయార్‌ అరుణాచలపురం ముత్తులక్ష్మి పార్కు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ యూనిట్‌ను గురువారం డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ ప్రారంభించారు. ముఖ్యమంత్రి దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో భాగంగా ఈ విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.3.6 కోట్లు కేటాయించిందన్నారు. ఈ విభాగంలోని డ్రోన్లు కృత్రిమ మేథో పరిజ్ఞానం కలిగి ఉంటాయని, వీటిని కంట్రోల్‌ రూం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల వరకు నడుపగలరన్నారు. ఈ కృత్రిమ మేథోపరిజ్ఞానం కలిగిన ఈ డ్రోన్లు పండుగలు, సభలు, ర్యాలీలు తదితర సమయాల్లో నిఘా వేయడానికి వీలుపడుతుంది. రేయింబవళ్లు జనసంచారంపై నిఘా వేసి, దారిదోపిడీలు, జేబు దొంగతనాలు జరిగితే అప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడం, నేరస్థులను గుర్తించటానికి ఈ డ్రోన్లు బాగా సహకరిస్తాయి. రహదారుల్లో వేగంగా వెళ్లే వాహనాల రిజిస్టర్‌ నెంబర్లను ఈ డ్రోన్లు వీడియో, ఫొటోలు తీస్తాయి. దారిదోపిడీ దొంగలు, నేరస్థుల గాలింపు చర్యలకు కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. ఇక మెరీనాబీచ్‌, పట్టినంబాక్కం బీచ్‌, బిసెంట్‌నగర్‌ బీచ్‌ తదితర సముద్రతీరాల్లో అలలలో చిక్కుకుని కొట్టుకుపోయేవారిని ఈ డ్రోన్లు గుర్తించి సముద్రతీర పోలీసులు సకాలంలో కాపాడేందుకు కూడా సహకరిస్తాయి. అంతే కాకుండా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దీని కూడా గుర్తించి వెంటనే క్రమబద్దీకరించేందుకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్లు ప్రేమానంద్‌ సిన్హా (సౌత్‌జోన్‌), జే లోగనాధన్‌ (హెడ్‌క్వార్టర్స్‌), అడయార్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ పి. మహేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-30T08:55:10+05:30 IST