Share News

Haryana:జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డీఎస్పీ.. హార్ట్‌ఎటాకే కారణమా?

ABN , First Publish Date - 2023-10-23T11:31:31+05:30 IST

జిమ్ లో వ్యాయామం చేస్తూ పోలీస్ అధికారి అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణా(Haryana)కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) జోగిందర్ దేస్వాల్ కర్నాల్ లోని నివసిస్తున్నారు. ఆయన సోమవారం ఉదయాన్నే ఇంట్లోని జిమ్(Gym)లో వ్యాయామం చేయడం స్టార్ట్ చేశారు. అయితే తెల్లవారుజామున 5 గంటలకు వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలారు.

Haryana:జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డీఎస్పీ.. హార్ట్‌ఎటాకే కారణమా?

చండీఘడ్: జిమ్ లో వ్యాయామం చేస్తూ పోలీస్ అధికారి అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణా(Haryana)కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) జోగిందర్ దేస్వాల్ కర్నాల్ లోని నివసిస్తున్నారు. ఆయన సోమవారం ఉదయాన్నే ఇంట్లోని జిమ్(Gym)లో వ్యాయామం చేయడం స్టార్ట్ చేశారు. అయితే తెల్లవారుజామున 5 గంటలకు వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే డీఎస్పీ మరణించినట్లు డాక్టర్లు(Doctors) వెల్లడించారు. దేస్వాల్‌ ని ఇటీవల పానిపట్‌లోని జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా నియమించారు. అయితే ఆయన మృతికి గల కారణాలు కచ్చితంగా తెలియరాలేదు. హార్ట్‌ఎటాక్(Heart Attack)తోనే ఆయన కుప్పకూలారని పలువురు చెబుతున్నారు.


వర్కౌట్ సమయంలో మరణాలు.. ఆందోళనలో యువత

ఇటీవల జిమ్‌కు వెళ్లేవారిలో ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువకులలో గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబరులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఒక వ్యాయామశాలలో ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న 19 ఏళ్ల యువకుడు సిద్దార్థ్ కుమార్ సింగ్ గుండెపోటు కారణంగా కుప్పకూలి మరణించిన వీడియో వైరల్ అయింది. జనవరిలో, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ జిమ్‌లో 55 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేసిన కాసేపటికే కార్డియాక్ అరెస్ట్ తో మరణించాడు. కన్నడ స్టార్ హీరో పునిత్ రాజ్ కుమార్, సిద్ధాంత్ సూర్యవంశీ, రాజు శ్రీవాస్తవ్ వంటి ప్రముఖులు కూడా వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. భారతదేశంలో గుండె జబ్బులు, గుండె పోట్ల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ అనంతర సమస్యలు, వాయు కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి సహా అనేక రకాల కారణాలు గుండె జబ్బులకు కారణంగా చెబుతున్నారు. దీంతో యువత నుంచి వృద్ధుల వరకు హార్ట్‌ఎటాక్ లు సాధారణంగా మారాయి. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జీషన్ మన్సూరి మాట్లాడుతూ.. ఇటీవల వస్తున్న గుండె పోటు కేసుల్లో ఎక్కువగా యువతే ఉంటున్నారని.. ఇది ఆందోళన కలిగించే పరిణామమని అన్నారు. ఇంతకుముందు 10 మంది గుండె వ్యాధిగ్రస్థుల్లో ఒకరు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారు ఉండేదని.. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10 మంది రోగులలో ముగ్గురు యూతే ఉంటున్నారని ఆయన వెల్లడించారు. అతిగా శారీరక శ్రమ చేయడమూ కార్డియక్ అరెస్ట్ కి దారి తీయవచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకుని, శరీరానికి అవసరమైన మేర వ్యాయామం చేస్తే గుండె జబ్బుల్ని(Heart Deceases) నియంత్రించవచ్చని డాక్టర్లు అంటున్నారు.

Updated Date - 2023-10-23T12:21:37+05:30 IST