Earthquake: బీహార్, సిలిగురిలో భూకంపం...భయాందోళనల్లో జనం
ABN , First Publish Date - 2023-04-12T07:42:44+05:30 IST
దేశంలోని బీహార్, సిలిగురిలలో బుధవారం భూకంపం సంభవించింది....
న్యూఢిల్లీ: దేశంలోని బీహార్, సిలిగురిలలో బుధవారం భూకంపం సంభవించింది.బీహార్ రాష్ట్రంలోని అరారియా సమీపంలోని పూర్ణియా వద్ద బుధవారం ఉదయం 5.35 గంటలకు భూకంపం సంభవించింది.(Earthquake) ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది. 10కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం రోడ్లపైకి పరుగులు తీశారు.
బీహార్ రాష్ట్రంతోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరానికి 140 కిలోమీటర్ల దూరం బుధవారం భూకంపం సంభవించింది.(Bihar,Siliguri) ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. బుధవారం ఉదయం సంభవించిన భూకంపంతో పర్యటనలకు వచ్చిన పర్యాటకులతోపాటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఏప్రిల్ 9వతేదీన నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. దేశంలో పలుచోట్ల సంభవించిన వరుస భూకంపాలతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.