Mondy laundering case: ఐఏఎస్ అధికారిణి రానూ సాహూ అరెస్టు
ABN , First Publish Date - 2023-07-22T14:14:40+05:30 IST
మనీలాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి రానూ సాహూను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారంనాడు అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలువురు వాణిజ్యవేత్తలు, కాంగ్రెస్ కోశాధికారి, ఐఏఎస్ రానూ సాహూ నివాసాలపై ఈడీ శుక్రవారం దాడులు జరిపింది.
రాయపూర్: మనీలాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి రానూ సాహూ (Ranu Sahu)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారంనాడు అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్ (Chattishgarh)లోని పలువురు వాణిజ్యవేత్తలు, కాంగ్రెస్ కోశాధికారి, ఐఏఎస్ రానూ సాహూ నివాసాలపై ఈడీ శుక్రవారం దాడులు జరిపింది. రానూ సాహూ నివాసంపై ఈడీ దాడులు జరపడం ఇది మూడోసారి.
ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుకున్న కోల్ లెవీ ఎక్స్‌టార్షన్ స్కామ్‌పై ఈడీ గతంలో జరిపిన దాడుల్లో రానూ సాహూ, ఇతరులకు చెందిన రూ.51.40 కోట్ల విలువైన 90 స్థిరాస్తులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకుంది. ఆమె భర్త అయిన ఐఏఎస్ అధికారి జేపీ మౌర్య నివాసంపైనా ఈడీ దాడులు జరిపింది. రాయగఢ్ కలెక్టర్‌గా రాణు సాహూ ఉన్నారు.