Election Commission: ఈసీ సంచలన ఆదేశాలు...కర్ణాటకలో హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం

ABN , First Publish Date - 2023-05-09T12:19:42+05:30 IST

కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఈసీ నిషేధం విధించింది....

Election Commission: ఈసీ సంచలన ఆదేశాలు...కర్ణాటకలో హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం
EC bans recitation of Hanuman Chalisa

బెంగళూరు: కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.(Election Commission) కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పఠనంపై నిషేధం విధించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి నిరసనగా మంగళవారం బెంగళూరులో బీజేపీ హనుమాన్ చాలీసా పఠిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.(Bans Recitation of Hanuman Chalisa) ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సీఆర్ పీసీ 144 సెక్షన్ విధించినందున వీహెచ్‌పీ సభ్యులు హనుమాన్ చాలీసా పఠించకుండా ఈసీ ఆపింది.

ఇది కూడా చదవండి : Uttar Pradesh : యూపీలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు...సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి

విజయనగర్‌లోని ఒక ఆలయం వెలుపల ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి లేదని ఎన్నికల సంఘం అధికారులు వీహెచ్‌పీ VHP సభ్యులను కోరారు. వీహెచ్‌పీ సభ్యులు తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-05-09T12:19:42+05:30 IST