Elections: సరిహద్దులో నిఘా తీవ్రతరం.. ముమ్మరంగా వాహనాల తనిఖీ

ABN , First Publish Date - 2023-03-21T11:36:29+05:30 IST

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సరిహద్దులో నిఘా పెంచాలని, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికా

Elections: సరిహద్దులో నిఘా తీవ్రతరం.. ముమ్మరంగా వాహనాల తనిఖీ

బళ్లారి(బెంగళూరు): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సరిహద్దులో నిఘా పెంచాలని, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పవన్‌ కుమార్‌ మాలపాటి(Pawan Kumar Malapati) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అనంతపురం, కర్నూలు జిల్లాల రెవెన్యూ, పోలీసుశాఖ, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో 52సరిహద్దు గ్రామాలకు సకాలంలో సమాచారం ఇచ్చి రోడ్డు గుండా అక్రమ రాకపోకలను నియంత్రించాలన్నారు. జిల్లా సరిహద్దులో 12చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, బట్టలు, వస్తువులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎటువంటి అనుమానం వచ్చినా తక్షణమే పోలీసు అధికారులకు తెలియజేయా లన్నారు. సరిహద్దు పోలీస్‌ స్టేషన్‌ల యొక్క అన్ని స్థాయిల అధికారులు వాట్సాప్‌ గ్రూప్‌ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేర వేయాల న్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు సరిహద్దు రాష్ట్రాల పోలీసు అధికారుల సహకారం అవసరం, అక్రమ డబ్బు, మద్యం విలువైన వస్తువుల రవాణాపై సమాచారాన్ని సేకరించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ రంజిత్‌కుమార్‌ బండారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ, జిల్లాపంచాయతీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ శరణప్ప సంకనూర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ హేమంతకుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ మహ్మద్‌జుబేరా, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T11:36:29+05:30 IST