Chandrayaan-3 : చంద్రయాన్-3పై ఎలన్ మస్క్ కామెంట్స్
ABN , First Publish Date - 2023-08-23T17:06:40+05:30 IST
చంద్రయాన్-3 కార్యక్రమంపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను; శక్తి, సామర్థ్యాలను చాటి చెప్తూ, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా దీని కోసం భారత్ చేస్తున్న ఖర్చు చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : చంద్రయాన్-3 కార్యక్రమంపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను; శక్తి, సామర్థ్యాలను చాటి చెప్తూ, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా దీని కోసం భారత్ చేస్తున్న ఖర్చు చర్చనీయాంశంగా మారింది. ఓ ఎక్స్ యూజర్ ఇచ్చిన ట్వీట్‌లో ఓ హాలీవుడ్ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు కన్నా చాలా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 జరుగుతోందని ప్రశంసించారు. దీనిపై ఎక్స్ యజమాని, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందించారు.
కెనడియన్ యూట్యూబర్, ఎడ్యుకేటర్ సిండీ పోమ్ ఏర్పాటు చేసిన సంస్థ న్యూస్‌థింక్ ఇచ్చిన ట్వీట్‌లో, హాలీవుడ్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’ కోసం అయిన ఖర్చు 165 మిలియన్ డాలర్లు అని, చంద్రయాన్-3 కోసం భారత దేశం చేసిన ఖర్చు 75 మిలియన్ డాలర్లు అని చెప్పారు. ‘ఇంటర్‌స్టెల్లార్’ సినిమాకు అయిన ఖర్చు కన్నా చంద్రయాన్-3కి అయిన ఖర్చు తక్కువ అని తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతారని తెలిపారు.
దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘గుడ్ ఫర్ ఇండియా’ అని శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ జాతీయ జెండాను జత చేశారు.
న్యూస్‌థింక్ పోస్ట్‌కు దాదాపు 12 లక్షల వ్యూస్ వచ్చాయి, మస్క్ కామెంట్‌ను దాదాపు 63 వేల మంది చూశారు. ఇండియన్ యూజర్లు మస్క్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అంగారక గ్రహంపై కూడా విజయం సాధించబోతున్నాం, చూడండి’’ అని ఓ ఎక్స్ యూజర్ తెలిపారు. చివరికి భారత దేశ సత్తాను జనం గుర్తిస్తున్నారని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు
Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..