Share News

Mahua Moitra: మహువా మొయిత్రాపై లోక్‌సభకు ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణ

ABN , First Publish Date - 2023-12-08T14:40:59+05:30 IST

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ నివేదక శుక్రవారంనాడు లోక్‌సభ ముందుకు వచ్చింది. బీజపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోంకర్ ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Mahua Moitra: మహువా మొయిత్రాపై లోక్‌సభకు ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే (cash-for-query) ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ (TMC) ఎంపీ మహువా మెయిత్రా (Mahua Moitra)పై పార్లమెంటు నైతిక విలువల కమిటీ నివేదక శుక్రవారంనాడు లోక్‌సభ (Lok Sabha) ముందుకు వచ్చింది. బీజపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోంకర్ ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదికను 'ఫిక్స్‌డ్ మ్యాచ్'గా అభివర్ణించాయి. నివేదిక ప్రతి తమకు ఇవ్వాలని, సభలో ఓటింగ్‌కు ముదు చర్చ జరపాలని సభ్యులు పట్టుపట్టారు. తన వాదనను వినిపించేందుకు మెయిత్రాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్ వారించినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎథిక్స్ కమిటీ నివేదికను సభ ఆమోదిస్తే మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.


కాగా, మహువా మొయిత్రాపై నిషాకాంత్ దూబే చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ 500 పేజీల నివేదికను నవంబర్ 9న ఆమోదించింది. మెయిత్రా అభ్యంతకరమైన, అనైతిక, నేర ప్రవర్తనకు పాల్పడ్డారని, ఆమెను 17వ లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫారసు చేసింది. 6:4 మెజారిటీతో తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది. పారిశ్రామికవేత్త హీరానాందనాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై నవంబర్ 2న ఎథిక్స్ కమిటీ ముందు మెయిత్రా హాజరై తన వాదనను వినిపించారు.

Updated Date - 2023-12-08T14:41:00+05:30 IST