Mamata Banerjee: చీమ కరిచినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు... కేంద్రంపై మమత ఫైర్

ABN , First Publish Date - 2023-08-22T19:55:10+05:30 IST

చీమ కరవడం వంటి చిన్నచిన్న ఘటనలను కూడా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థల దర్యాప్తునకు అప్పగిస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee: చీమ కరిచినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు... కేంద్రంపై మమత ఫైర్

కోల్‌కతా: చీమ కరవడం వంటి చిన్నచిన్న సంఘటనలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) తప్పుపట్టారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.


ప్రధానమంత్రి అందర్నీ కలుపుకొని వెళ్తామని ఓవైపు చెబుతూనే, విపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని, చీమ కాటు వేసినా కూడా ఈడీ, సీబీఐలకు దర్యాప్తు అప్పగిస్తు్న్నారని అన్నారు. అకారణంగా తమ (బెంగాల్) ప్రజలను కేంద్ర ఏజెన్సీలు టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీలో విద్యార్థి ఆత్మహత్యపై మాట్లాడుతూ, ఈ ఘటనతో వెంటనే తాము అప్రమత్తమయ్యాయని, ర్యాగింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లోనూ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌ ప్రారంభించినట్టు తెలిపారు.


దుర్గా పూజా కమిటీలకు గ్రాంట్ పెంపు

కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టేట్ పూజా కమిటీల సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా పూజా కమిటీలకు గ్రాంట్‌ను రూ.60,000 నుంచి 70,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు

Updated Date - 2023-08-22T19:55:10+05:30 IST