Share News

Uttarakashi tunnel: కొండ పైనుంచి నిలువగా డ్రిల్లింగ్ పనులు...పూర్తయ్యేది ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-11-27T19:17:33+05:30 IST

ఉత్తరాఖండ్ సొరంగంలో గత 16 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను రక్షించేందుకు కొండ పైనుంచి నిలుపుగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. నవంబర్ 30 కల్లా వర్టికల్ డ్రిల్లింగ్ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ సోమవారంనాడు తెలిపారు.

Uttarakashi tunnel: కొండ పైనుంచి నిలువగా డ్రిల్లింగ్ పనులు...పూర్తయ్యేది ఎప్పుడంటే..?

ఉత్తర్‌కాశీ: ఉత్తరాఖండ్ సొరంగంలో (Uttarakhand tunnel) గత 16 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను రక్షించేందుకు కొండ పైనుంచి నిలుపుగా చేపట్టిన డ్రిల్లింగ్ (Vertical drilling)పనులు చురుకుగా సాగుతున్నాయి. నవంబర్ 30 కల్లా వర్టికల్ డ్రిల్లింగ్ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ సోమవారంనాడు తెలిపారు. సుమారు 30 మీటర్ల మేర డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశామని, ప్రస్తుత మిషన్‌తో 40-45 మీటర్ల లోతువరకూ డ్రిల్లింగ్ చేయవచ్చని చెప్పారు. డ్రిల్లింగ్ కోసం మరో రెండు మిషన్లు కూడా తెప్పించామన్నారు. ఎస్జేవీఎన్ఎల్ ఈ మిషన్లు తీసుకువచ్చిందన్నారు. మిషన్ల ఛేంజోవర్‌కు సమయం పడుతుందని, వర్టికల్ డ్రిల్లింగ్ పనులు నవంబర్ 30 కల్లా పూర్తవుతాయని అంచనా వేస్తు్న్నామని తెలిపారు.


పనుల ప్రారంభానికి ముందు ప్రార్థనలు

సోమవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభానికి ముందు టన్నెల్ ప్రవేశమార్గం వద్ద ప్రార్థనలు నిర్వహించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ సెక్రటరీ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు. మరోవైపు, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా సారథ్యంలోని ప్రతినిధి బృందం సైతం రెస్క్యూ ఆపరేషన్‌‌ను సమీక్షించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సైతం టన్నెల్‌లో పనుల పురోగతిని దగ్గరుండి సమీక్షించారు. టన్నల్‌లో చిక్కుకున్న కార్మికులు, వారి కుటుంబాలకు పీకీ మిశ్రా మాట్లాడారు.


విరిగిపోయిన ఆగర్ యంత్ర భాగాల తొలగింపు

ఆగర్ మిషన్‌కు చెందిన శిథిలాలను సొరంగం నుంచి తొలగించినట్టు మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ తెలిపారు. మరి కొద్ది గంటల్లోనే మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభిస్తామి చెప్పారు. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంతభాగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది.

Updated Date - 2023-11-27T19:17:35+05:30 IST