Amritsar: స్వర్ణ దేవాలయం వద్ద మూడోసారి పేలుడు
ABN , First Publish Date - 2023-05-11T09:06:51+05:30 IST
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు జరిగింది....
అమృత్‌సర్: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు జరిగింది.(Explosion)కేవలం వారం వ్యవధిలో పరిసరాలను కుదిపేసిన మూడో పేలుడు ఘటన జరగడం సంచలనం రేపింది.ఈ పేలుడుకు కారణమైన ఐదుగురు నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.అమృత్‌సర్‌లోని (Amritsar)స్వర్ణ దేవాలయం(Golden Temple) ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఈ పేలుడు వెనుక ఉద్ధేశమని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Wedding: పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా...ఏమైందంటే షాకింగ్
పేలుడు జరిగిన సమయంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ సమీపంలోని గదిలో ఉన్నారని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి.గురువారం నాటి పేలుడుకు కారణమైన క్రాకర్‌లో పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అంతకుముందు మే 6వతేదీ, మే 8 తేదీల్లో వరుసగా గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.రెండో పేలుడు జరిగిన ప్రదేశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం కూడా సందర్శించి పరిశీలించింది.