Fake doctors: అమ్మో.. మొత్తం 51 మంది నకిలీ డాక్టర్లట..!
ABN , First Publish Date - 2023-04-12T11:34:46+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 51 మంది నకిలీ వైద్యులను(Fake doctors) అరెస్టు చేశారు. రాష్ట్రంలో
పెరంబూర్(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 51 మంది నకిలీ వైద్యులను(Fake doctors) అరెస్టు చేశారు. రాష్ట్రంలో నకిలీ వైద్యుల సంఖ్య పెరుగుతుందనే ఫిర్యాదులతో ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరిలో అధికంగా తిరువళ్లూర్ జిల్లాలో 15 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వైద్యులను అరికట్టేలా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంధిల్‌కుమార్ తెలిపారు.