Filmcity: ఇక ఇదే ఫైనల్... మైసూరులోనే ఫిలింసిటీ : సీఎం
ABN , First Publish Date - 2023-07-08T12:07:47+05:30 IST
సంవత్సరాల కాలంగా నలుగుతున్న ఫిలింసిటీ వివాదానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెరదించారు. శుక్రవారం సమ
- ఏడాదంతా కన్నడ భాషా ఉత్సవాలు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సంవత్సరాల కాలంగా నలుగుతున్న ఫిలింసిటీ వివాదానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తెరదించారు. శుక్రవారం సమర్పించిన బడ్జెట్‌లో దీనిపై స్పష్టత ఇచ్చారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో రాచనగరి మైసూరులో ఫిలింసిటీ(Filmcity)ని ఏర్పాటు చేయాలని 2015-16 బడ్జెట్‌లోనే ప్రతిపాదించిన సంగతిని గుర్తుచేశారు. బెంగళూరు నగరంలో ఫిలింసిటీ ఏర్పాటు చేయాలని తలపోసినా ఇదీ ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదన్నారు. మైసూరు(Mysoore)లోనే ఫిలింసిటీ ఏర్పాటుకు చర్యలను ఇక వేగవంతం చేస్తామన్నారు. గత మూడేళ్లుగా కన్నడ చిత్రాలకు సబ్సిడీని నిలిపేశారని, దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. బెంగళూరు(Bengaluru)లోని రాజ్‌కుమార్ సమాధి వద్ద కన్నడ చిత్రరంగ ప్రగతిని తెలిపే మ్యూజియంను ఏర్పాటు చేస్తామన్నారు. మైసూరు రాష్ట్రానికి కర్ణాటక నామకరణం చేసి నవంబరు 1నాటికి 50 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఏడాదిపాటు కన్నడ చరిత్ర, సాహిత్య సంస్కృతులపై పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.