AIIMS Fire accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-08-07T14:03:11+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో అంతస్తులో సోమవారంనాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సకాలంలో మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

AIIMS Fire accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) రెండో అంతస్తులో సోమవారంనాడు భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు పైన ఉన్న ఎండోస్కోపిక్ రూమ్‌లో మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో గదిలోని పేషెంట్లను వెంటనే ఖాళీ చేయించారు. ఆరుకు పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని ఒంటి గంట ప్రాంతానికి మంటలను అదుపులోనికి తెచ్చాయి.


కాగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదం కారణం మాత్రం వెంటనే తెలియలేదు. ఆసుపత్రికి చెందిన అండర్ వాటర్ గ్రౌండ్ ట్యాంకులోని నీటిని కూడా మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించారు. సుమారు 16 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-08-07T14:05:43+05:30 IST