Share News

Gogamedi Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్టు

ABN , First Publish Date - 2023-12-09T19:17:48+05:30 IST

రాజస్థాన్‌ లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది రుణ హత్య కేసులో శనివారంనాడు తొలి అరెస్టు చోటుచేసుకుంది. గోగమేదిపై కాల్పులు జరిపిన షూటర్లు రోహిత్, నితిన్‌ వెంటనే అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యేందుకు సహకరించిన రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Gogamedi Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్టు

జైపూర్: రాజస్థాన్‌ (Rajasthan)లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది (Sukhdev Singh Gogamedi) దారుణ హత్య కేసులో శనివారంనాడు తొలి అరెస్టు చోటుచేసుకుంది. గోగమేదిపై కాల్పులు జరిపిన షూటర్లు రోహిత్, నితిన్‌ వెంటనే అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యేందుకు సహకరించిన రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. షూటర్ నితిన్ ఉంటున్న గ్రామంలోనే రామ్‌వీర్ నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


జైపూర్‌లో ఈనెల 5న సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది తన ఇంట్లో నలుగురు వ్యక్తులతో కలిసి టీ తాగుతూ ముచ్చటిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన రక్తపుమడుగులో అచేతనంగా పడిపోయారు. క్రాస్‌ఫైర్ సమయంలో మరణించిన మూడో షూటర్‌ను నవీన్ సింగ్ షెకావత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో గోగమేది బాడీగార్డ్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఈ హత్య తమ పనేనని గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ప్రకటించాడు. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికార మార్పడి జరగాల్సి ఉన్న తరుణంలో కర్ణిసేన చీఫ్ దారుణహత్యకు గురికావడం తీవ్ర సంచలనమైంది. కాగా, తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు పోలీసుల కోసం రాజస్థాన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించనున్నారు.

Updated Date - 2023-12-09T19:17:49+05:30 IST