Rajastan Politics: అశోక్ గెహ్లాట్‌పై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2023-07-08T22:41:41+05:30 IST
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతకొంత కాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్మ ధ్య దోస్తీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామానికి బలం చేకూర్చుతున్నాయి.
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల(Rajasthan Assembly) సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతకొంత కాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి(Chief Minister) అశోక్ గెహ్లాట్( Ashok Gehlot), మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్(Sachin Pilot) మధ్య దోస్తీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామానికి బలం చేకూర్చుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సలహా మేరకు సీఎం అశోక్ గెహ్లాట్‌తో తాను పొత్తు పెట్టుకున్నానని కాంగ్రెస్ నేత సచిన్ పైటల్ శనివారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వమే ఏకైక మార్గమని సచిన్ పైలట్ అన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై సమావేశం జరిగిన కొద్ది రోజుల త్వరాత సచిన్ పైలట్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో నాయకత్వం అంతా ఐక్యం ముందుకు సాగితేనే గెలవగలమని, క్రమశిక్షణ కొనసాగించని పార్టీ నేతలపై వేటు తప్పదని కాంగ్రెస్ అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఫోరమ్ వెలపల ఎవరూ మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవచ్చని పార్టీ సూచించింది.
అశోక్ గెహ్లాట్ జీ నా కంటే పెద్దవాడు.. అతనికి ఎక్కువ అనుభవం ఉంది.. అతని భుజాలపై గురుతర బాధ్యతలు ఉన్నాయి. నేను రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను అందరినీ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి (గెహ్లాట్) అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అతను అందరినీ తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను" అని సచిన్ పైలట్ తెలిపారు.
ఒక వ్యక్తికంటే పార్టీ, ప్రజలే ముఖ్యం.. నేను కూడా దీనిని అర్థం చేసుకున్నాను.. సీఎం గెహ్లాట్ కూడా అర్థం చేసుకున్నాడు.. కలిసి ముందుకు సాగేందుకు కృషి చేస్తామని’’ మాజీ డిప్యూటీ సీఎం పైలట్ అన్నారు. వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వంపై విమర్శల విషయంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందన ఎలా ఉందన్నా ప్రశ్నకు సచిన్ పైలట్ స్పందిస్తూ.. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు పైలట్ తెలిపారు.
ఎవరు.. ఎప్పుడు, ఏం చెప్పారనే దానిపై చర్చకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని.. ప్రజాజీవితంలో, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నానని పైలట్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపొందడమే మా లక్ష్యం అని అన్నారు.
సీఎం అభ్యర్థి ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ నిర్ణయాన్ని పైలట్ అంగీకరించారు. 2018 ఎన్నికల్లో కూడా పార్టీ ఐక్య ఫ్రంట్‌గా పోరాడిందని, అప్పుడు కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని.. ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటించారని పైలట్ అన్నారు.
కాగా.. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గెహ్లాట్, పైలట్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2020లో పైలట్, గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఫలితంగా పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పదవుల నుంచి సచిన్ పైలట్‌ను తొలగించారు.