Former Chief Minister: ప్రాణం పోయినా మార్పులేదు.. 24 గంటల్లోనే ఆ రెండు పథకాలు
ABN , First Publish Date - 2023-02-09T12:10:06+05:30 IST
ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడతామని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన 24 గంటల్లోనే ప్రకటించిన రెండు చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తామని,
- సిద్దరామయ్య
బెంగళూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడతామని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన 24 గంటల్లోనే ప్రకటించిన రెండు చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తామని, ఇందుకోసం ప్రాణంపోయినా మార్పు ఉండదని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Former Chief Minister and Leader of Opposition Siddaramaiah) స్పష్టం చేశారు. కలబురగి జిల్లా ఆళంద తాలూకాలో ప్రజాధ్వని యాత్రలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహలక్ష్మి పథకం ద్వారా గృహిణికి రూ. 2వేలు అందించే పథకాల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు. కమీషన్ ప్రభుత్వంలో అలీబాబా 40 దొంగలు ఉన్నారని ఆరోపించారు. లూటీ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు ఆర్థికభారం భరిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందువుల హత్యలే కాదని, ముస్లింల హత్యలు జరిగాయని వీటికి ఆర్‌ఎ్‌సఎస్ బీజేపీ వారే కారణమన్నారు. పరేశ్‌మేస్తా హత్య తర్వాత తీవ్రమైన గొడవ చేశారని, తర్వాత విచారణలో ఏమైందో అందరికీ తెలుసన్నారు. హిందూ మతాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, సామరస్యతను భంగం కలిగిస్తున్న బీజేపీ నాయకులను విమర్శించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌లో పోటీ చేస్తే 150 స్థానాలు గెలుస్తాయనే సీటీ రవి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అతడు ఆర్‌ఎ్‌సఎస్ గిరాకీ అని, అబద్ధాలు చెప్పడమే అతడి నైజమన్నారు. కర్ణాటక ఏ దేశంలో ఉందో తెలుసుకోవాలన్నారు. వ్యాఖ్యానించేముందు సమగ్రత ఉండాలని, నోటికొచ్చినట్టు మాట్లాడరాదని హితవు పలికారు.
ఇదికూడా చదవండి: మంగళూరులో పగటిపూట విమానాల సంచారాలకు బ్రేక్