Former CM: మాజీసీఎం ఆసక్తికర కామెంట్స్.. ‘కావేరి’ విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా..
ABN , First Publish Date - 2023-09-30T11:54:23+05:30 IST
కావేరి జల వివాదాన్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం దారితప్పిందని, చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటోందని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జల వివాదాన్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం దారితప్పిందని, చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతా అయ్యాక ప్రభుత్వం ఇప్పుడు న్యాయనిపుణులు, రైతునేతలతో చర్చలు జరుపుతోందన్నారు. ఈ ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించి ఉంటే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగేదన్నారు. కనీసం ఇప్పుడైనా కావేరిపై నిజాయతీగా న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కావేరీ జల వివాద అంశంలో సీఎం, డీపీఎం మధ్య సమన్వయం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బొమ్మై పేర్కొన్నారు.