Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పతనం.. త్వరలోనే తీహార్ జైలుకు ఉప ముఖ్యమంత్రి
ABN , First Publish Date - 2023-10-10T11:33:31+05:30 IST
రాష్ట్ర రాజకీయాలపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాలపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామనగర జిల్లా బిడది కేతగానహళ్లిలో పార్టీ ముఖ్యులతో ఆదివారం సమావేశమైన సందర్భంలో కుమారస్వామి మాట్లాడా రు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పతనం కానుందని జోస్యం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) మరోసారి తీహార్ జైలుకు వెళతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలేందుకు డీకే శివకుమార్ కారకుడన్నారు. జోడెద్దులంటూనే తన చేయి పైకి ఎత్తించి ప్రభుత్వాన్ని కూల్చారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఎంతగానో ప్రయత్నించానని మొసలి కన్నీరు పెట్టారని, న మ్మకంతో గొంతుకోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర స్తుతం ప్రభుత్వం పాపాల సుడిలో తిరుగుతోందని, ఇంతటి చెడ్డ ప్రభుత్వాన్ని చూడలేదని పేర్కొన్నారు. అంతరంగిక కలహాలతోనే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. 2024లో శాసనసభ ఎన్నికలు జరగడం తథ్యమన్నారు. అక్రమాస్తుల కేసులో తీహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి తీహార్ జైలుకెళితే శాశ్వతం కావచ్చు అన్నారు. మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళితో తనకు ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు. బెళగావి జి ల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో డీకే శివకుమార్ జోక్యం చేసుకున్నారని, అక్కడి నుంచి ప్రారంభమైన వివాదంతోనే తన ప్రభుత్వం కూలి బలిపశువు అయ్యానని చెప్పుకొచ్చారు.