Former CM: మాజీ సీఎం సంచలన ప్రకటన.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-06-02T08:34:00+05:30 IST
రాష్ట్ర రైతులకు నష్టం కలిగించే విధంగా మెకెదాటు డ్యాం నిర్మించాలన్న కర్ణాటక ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర రైతులకు నష్టం కలిగించే విధంగా మెకెదాటు డ్యాం నిర్మించాలన్న కర్ణాటక ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ప్రకటించారు. ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో, కర్ణాటకలో గత ప్రభుత్వం మెకెదాటు ప్రాంతంలో డ్యాం నిర్మించే ప్రయత్నాలు చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రి హోదాలో తాను కేంద్రప్రభుత్వంతో చర్చించి ఆ ప్రయత్నాలను విరమించుకొనేలా చేశానని తెలిపారు. అంతేకాకుండా, చట్టపరంగా కూడా రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, మెకెదాటు ప్రాంతంలో డ్యాం నిర్మించడం వల్ల కావేరి డెల్టా జిల్లాలు ఎడారిలా మారి సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. అంతర్ రాష్ట్రాల నదీజలాల వివాద చట్టం 1956 ప్రకారం, నదీజలాలను అడ్డుకోవడం, దారి మళ్లించే అధికారం ఏ రాష్ట్రానికి లేదని స్పష్టంగా ఉందని, అయినప్పటికీ ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాల తీర్పులు, కావేరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంఘించి మెకెదాటు డ్యాం(Mekedatu Dam) నిర్మిస్తామని ప్రకటించడం దురదృష్టకరమని తెలిపారు. ఈ వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో చర్చించి కర్ణాటక ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని ఈపీఎస్ ప్రకటన ద్వారా కోరారు.