Former CM: అసలు విషయం చెప్పేసిన మాజీ సీఎం.. ఆయన ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-06-14T11:31:46+05:30 IST

ప్రతిపక్షనేత హోదా రేసులో తాను లేనని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టపడడం లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former C

Former CM: అసలు విషయం చెప్పేసిన మాజీ సీఎం.. ఆయన ఏమన్నారంటే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత హోదా రేసులో తాను లేనని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టపడడం లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) వెల్లడించారు. ప్రతిపక్షనేత ఎంపిక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే సరికి జరుగుతుందన్నారు. హుబ్బళ్లిలోని నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిసారి జరిగే తరహాలోనే ఓటమిపై జాతీయ నాయకులు సమీక్షలు చేశారని తెలిపారు. ప్రజాతీర్పును అంగీకరించామని పేర్కొన్నారు. ఓటమికి తానే బాధ్యతగా భావించానని చెప్పారు. అందరి ఓటమికి తానే కారణమనే ప్రశ్న ఉద్భవించదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‏తో పొత్తు అంశంపై చర్చలు జరగలేదన్నారు. బీజేపీని వీడి కాంగ్రె్‌సలో చేరిన జగదీశ్‌శెట్టర్‌(Jagdish Shetter) సంతృప్తికరంగా ఉన్నానని చెప్పుకొన్నారని మరోసారి ఆయన పార్టీలోకి వచ్చే ప్రశ్న తలెత్తదన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి మరోసారి టికెట్‌ ఇవ్వరాదని కొందరు సోషల్‌మీడియాలో డిమాండ్‌ చేసినంత మాత్రాన పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న గ్యారెంటీలు ఒకచోట అమలు చేసి మరోచోట చేతులెత్తేసేలా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌలభ్యం కల్పించాలన్నారు. సీఎం సిద్దరామయ్య ఆర్థిక నిర్వహణ ఏ విధంగా అమలు చేస్తారనేది వేచి చూడాల్సిందే అన్నారు. ఉచిత విద్యుత్‌ అంశం కూడా సక్రమంగా లేదన్నారు. తమ ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీల పెంపునకు అంగీకరించలేదన్నారు. ఒక్కసారిగా చార్జీల పెంపుతో ప్రజలు షాక్‌ తిన్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రకృతి వ్యతిరేకంగా మారిందన్నారు. నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపలేదని, విత్తన పనులు జరగలేద పేర్కొన్నారు. పార్టీ ప్రగతికి ఏ విధంగా వ్యవహరించాలనేది సమష్టిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2023-06-14T11:31:48+05:30 IST