Former CM: ఆ నిర్ణయం వెనుక అసలు విషయం ఇదేనట.. మాజీ సీఎం ఏం చెప్పారంటే..
ABN , First Publish Date - 2023-09-12T11:40:22+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలన్నది ప్రజల అభిమతమని,
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలన్నది ప్రజల అభిమతమని, ఈ దిశలోనే జేడీఎస్‌కు స్నేహ హస్తం అందించామని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. హుబ్బళ్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు ప్రవహించే నీరులాంటివని, ఆయా సమయాలకు తగ్గట్లు పొత్తులు, అవగాహనలు సర్వసాధారణమని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు విషయమై జేడీఎస్‌లో ఎలాంటి అపశృతులు లేవని, ఒకవేళ ఒకటీ అరా ఉన్నా పార్టీ నేతలు వాటిని సరిదిద్దుతారని తెలిపారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని బొమ్మై అన్నారు. సిద్దూ పాలన దిక్కూ దిశా లేకుండా కేవలం వేధింపులు, కక్షసాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ, జేడీఎస్ ఇకపై ఉమ్మడిగా పో రాటం చేస్తాయని, ఉభ య పార్టీల నేతలు కలిసి ఇందుకు సం బంధించిన వ్యూహాలను సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.