Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు
ABN , First Publish Date - 2023-07-12T08:55:25+05:30 IST
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి కామరాజ్(Former minister Kamaraj)పై ఛార్జీషీటు దాఖలైంది. అన్నాడీఎంకే ప్రభుత్వం
పెరంబూర్(చెన్నై): ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి కామరాజ్(Former minister Kamaraj)పై ఛార్జీషీటు దాఖలైంది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఆహార శాఖ మంత్రిగా ఉన్న కామరాజ్, 2015-21 వరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులతో ఆయనపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కామరాజ్ ఇళ్లు, కార్యాలయం తదితర మొత్తం 49 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి, ఆయన కుమారుడు సహా ఆరుగురిపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో మంగళవారం రూ.127 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కామరాజ్, ఆయన ఇద్దరు కుమారులు సహా ఆరుగురిపై 810 పేజీల ఛార్జీషీటు తిరువారూర్ జిల్లా అవినీతి నిరోధక కోర్టులో దాఖలైంది. ఛార్జీషీటుతో పాటు 18 వేల దస్తావేజులను పెట్టెలో కోర్టుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సమర్పించారు.